NTV Telugu Site icon

Palla Rajeshwar Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు..

Palla Rajeshwer Reddy

Palla Rajeshwer Reddy

జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్.రమణ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతంతో ఓటమి చెందామని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 పైన ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ రంగంను పండగ చేసిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు. కేసీఆర్ సర్కార్, రేవంత్ సర్కార్ కు వ్యవసాయ రంగంలో తేడాను ప్రజలు గమనిస్తున్నారు.. రుణమాఫీ విషయంలో రేవంత్ అబద్దాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు.

Off The Record: భువనగిరి బీఆర్‌ఎస్ పార్టీలో కంగారుకు కారణం ఏంటి ? క్యామ మల్లేష్ లెక్కలు కుదరలేదా ?

15 వేల రైతు బందు ఏమైంది…కేసీఆర్ ఇచ్చిన 10 వేలు రైతుబంధు ఇవ్వలేదని దుయ్యబట్టారు. వరికి రూ. 500 బోనస్ ఇస్తాం అన్నారు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు భీమా, 24 గంటల కరెంటు, సాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన నష్టం రైతులకు తెలుసు.. రేవంత్ సర్కార్ కు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. న్యూట్రిషన్ కిట్స్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కాలేదని తెలిపారు. 50 వేల మెగా డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. 4వేల నిరుద్యోగ భృతిపై నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు.

Robbery: ఆడిషన్ కి వచ్చి నిర్మాతను దోచేసిన నటుడు?

జాబ్ క్యాలండర్ ఎందుకు ప్రకటించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. అన్ని అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేశారని… పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మోసపోయే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటా అడిగే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. బీజేపీ ఎంపీ అరవింద్ బాండ్ పేపర్, పసుపు బోర్డు అబద్దాలపై గెలిచారని.. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయితే ప్రజలు కూడా కుమ్మక్కై బీఆర్ఎస్ కే ఓట్లు వేస్తారని తెలిపారు. మరోవైపు.. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైందని, కేసీఆర్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు.