గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో భాగంగా కమర్షియల్ (వ్యాపార అవసరాలకు) గ్యాస్ సిలిండర్ ధరను రూ.103.50 మేర ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,174కి చేరింది. అటు హైదరాబాద్ మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278గా నమోదైంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం ఆయిల్ కంపెనీలు కనికరం చూపించాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరను కంపెనీలు పెంచకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: ట్విటర్ నూతన సీఈవో పరాగ్ అగర్వాల్ జీతం ఎంతో తెలుసా?
కాగా గతనెలలో రూ.265 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర తాజాగా రూ.103.50 పెరగడంతో దాదాపు రూ.370 మేర వినియోగదారులపై అధిక భారం పడుతోంది. కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో పరోక్షంగా సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే కర్రీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్ల వారు కమర్షియల్ సిలిండర్ వాడతారు కాబట్టి ఆహార ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
