Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.దేశంలో రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారత్‌లో ఇప్పటికే 245 కేసులకుపైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి తీవ్రత మాత్రం పది రాష్ట్రాల్లోనే ఉండటంతో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి కేసులను అధ్యయనం చేస్తారు.

https://ntvtelugu.com/central-teams-are-going-to-the-states-to-give-instructions-on-omicron/

2. ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవోటెల్‌ హోటల్‌లో తన భార్య భారతితో కలిసి జగన్ సీజేఐను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు కడప జిల్లా వెళ్లిన జగన్ ఈరోజు మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు.

https://ntvtelugu.com/ap-cm-jagan-and-his-wife-meets-cji-nv-ramana/

3. ఈమధ్యే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు మంత్రి కేటీఆర్. తన కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బంజారా హిల్స్‌ ఏసీపీకి టీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. కేటీఆర్‌ కొడుకు హిమాన్షుపై ట్విటర్‌లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులు తీన్మార్‌ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు.

https://ntvtelugu.com/minister-ktr-complaint-against-teenmar-mallanna/

4.మిషన్‌ 70. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ముందున్న టార్గెట్‌. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కమలనాథులు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారట. ఇంఛార్జుల వేటలో పడినట్టు చెబుతున్నారు.

https://ntvtelugu.com/special-story-on-telangana-bjp-party/

5. దేశంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ఫండ్‌కు రూ.1,000 విరాళం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు, దేశాన్ని దృఢం చేసేందుకు అందరూ సాయం చేయాలని ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. తన వంతుగా రూ.వెయ్యి సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.

https://ntvtelugu.com/netizens-setires-pm-modi-doantes-his-party-to-only-thousand-rupees/

6 ప్రపంచంలోనే తొలి రైలును పోలిన బస్సు తెరమీదకు వచ్చింది. దీనిని డ్యూయల్ మోడ్ వాహనం అండే డీఎంవీ అనవచ్చన్నమాట. డీఎంవీ ఒక మినీ బస్సు, మినీ రైలు మాదిరిగా పనిచేస్తుంది. సాధారణ రబ్బరు టైర్లతో సంప్రదాయ రోడ్లపై నడుస్తుంది. అంతేకాదు రైలు పట్టాలపై కూడా అచ్చం రైలులాగా వేగంగా పరుగులు తీస్తుంది. 

https://ntvtelugu.com/japan-railway-introduces-dme-bus-cum-railservice/

7.టీమిండియా దిగ్గజ బౌలర్ హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే హర్భజన్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్వయంగా హర్భజన్ వెల్లడించాడు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి సేవ చేయాలని భావిస్తున్నానని.. అయితే అది రాజకీయాల రూపంలోనా లేదా ఇతర రూపంలోనా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భజ్జీ తెలిపాడు.

https://ntvtelugu.com/harbhajan-singh-clarity-about-political-entry/

8 .క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్ తెలిపాడు.

https://ntvtelugu.com/sachin-tendulkar-in-christmas-santa-getup/

9. ముంబై తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన దృష్టిని దక్షిణాది వైపు మళ్లించాడు. ముంబైలో తారక్, చరణ్, రాజమౌళి “బిగ్ బాస్ సీజన్ 15” నుంచి “ది కపిల్ శర్మ షో”తో సహా ప్రముఖ టీవీ షోలలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ సినిమా విడుదలపై భారీగా హైప్ పెంచేశారు. ఇక ఇప్పటిదాకా బాలీవుడ్ పై పూర్తిగా ఫోకస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఇప్పుడు సౌత్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. 

https://ntvtelugu.com/rrr-grand-pre-release-event-at-chennai-on-dec-27th/

10. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధ స్తూపాలు ఉన్న ధనంకొండ. దాదాపు 330 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ప్రాంతం. ఎంతో చరిత్ర ఈ కొండల్లో నిక్షిప్తం. అలాంటి చరిత్రను చెరిపేసే పని మొదలుపెట్టింది మైనింగ్‌ మాఫియా. ఆలోచన వచ్చిందే తడవుగా కొండను తవ్వి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. కొండను తవ్వి ఎర్ర మట్టి.. లైట్రేట్‌ను తరలించేందుకు.. భారీగా సొమ్ము చేసుకునేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని చెబుతున్నారు.

https://ntvtelugu.com/special-focus-on-mafia-in-east-godavari/
Exit mobile version