1. తెలంగాణ రైతుల హక్కులను టీఆర్ ఎస్ ప్రభుత్వం బీజేపీకి తాకట్టు పెట్టిందని.. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖరీఫ్ ధాన్యం కొనకుండా రైతు సమస్య నుండి తప్పించుకునే కుట్ర సీఎం కెసిఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు నెలల నుండి రైతులు హరిగోస పడుతున్నారని… కళ్ళాల దగ్గర వడ్లు, ఇంటి దగ్గర రైతుల శవాలు అన్నట్టుంది పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు.
రైతుల హక్కులను బీజేపీకి తాకట్టు పెట్టింది :రేవంత్ రెడ్డి
2.నదిలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నౌకమొత్తం వ్యాప్తించడంతో.. 40 మంది సజీవంగా దహనమైన విషాద ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు చెలరేగాయి.
నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది సజీవ దహనం
3. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు ఆయన సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే ఆయనను గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరేగింపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల అభినందన సభలో మాట్లాడారు.
నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టం : సీజేఐ ఎన్వీ రమణ
4.కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం నాడు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు.
ఆదిత్య బిర్లా కంపెనీతో 2వేల ఉద్యోగాలు: సీఎం జగన్
5. తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావడం వల్లనే సిద్దిపేట ప్రాంతం దశ దిశా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద త్రీ స్టార్ టూరిజం హోటల్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టూరిజం శాఖ కార్పోరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు.
కేసీఆర్ సీఎం.. కావడం వల్లనే సిద్దిపేట దశ దిశ మారింది : హరీష్ రావు
6.తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధర పెంపునకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుల తో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం… ఏసీ థియేటర్లలో కనిష్ట టికెట్ ధర 50 రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 150 రూపాయలకు చేరనుంది.
సినిమా టికెట్ల ధరలు పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
7. ఇంటర్ విద్యార్ధులకు సంఘీభావంగా మేము మూడు గంటలు దీక్ష చేశాం. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. సీఎం కేసీఆర్‌ని అప్పాయింట్ మెంట్ కోరాం. ఆయన్ని కలిసి సమస్య చెబుదామని అడిగాం.. కానీ రిప్లై లేదు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందకండి అని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన రాకుంటే.. ..మంగళవారం ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపు నిస్తామన్నారు.
మంగళవారం ఇంటర్ బోర్డు ముట్టడి..జగ్గారెడ్డి వార్నింగ్
8. ‘పుష్ప’ వెనకే సౌతిండియాలోని నాలుగు భాషల్లో జనం ముందుకు వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. హిందీలో ఈ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్న నిర్మాత బోయనపల్లి వెంకట్ ఉత్తరాదిన దీన్ని రిలీజ్ చేయలేదు. కోల్ కత్తా నేపథ్యంలో, పునర్ జన్మ కథాంశంతో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా ఉందో తెలుసుకుందాం.
9. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. గత ఏడాది ఎస్పీ బాలు వంటి లెజెండ్ కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. తాజాగా తమిళ సినీ నటుడు, సీనియర్ కమెడియన్ వడివేలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.
తమిళ సీనియర్ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్
10. టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్.
