1 దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు ఇప్పటి వరకు దేశంలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్‌లో మరణాల రేటు తక్కువగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలోనే బ్రిటన్‌లో ఒమిక్రాన్ మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే దీనిపై రాష్ట్రాలను హెచ్చరించింది.
ఒమిక్రాన్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు
2 దశాబ్దాలుగా ఉన్న ఎన్నికల సవరణ చట్టాల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఓటర్ కార్డుతో-ఆధార్ అనుసంధాన బిల్లును లోక్ సభలోసోమవారం ఆమోదించింది.
ఓటర్ కార్డుతో- ఆధార్ అనుసంధాన బిల్లు ఆమోదం
3 ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
4పనామా పేపర్స్ లీక్ కేసులో బచ్చన్ కుటుంబానికి కష్టాలు పెరిగాయి. ఈ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌కి ఈడీ సమన్లు పంపింది. పనామా పేపర్ లీక్ కేసులో ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
ఐశ్వర్య రాయ్ కి ఈడీ షాక్… పనామా పేపర్స్ లీక్ కేసులో నోటీసులు
5 2020 కి ముందు ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్‌గా ఉండేది. ఎవరి యాంబీషన్స్ ను వారు రీచ్ అయ్యేందుకు పరుగులు తీస్తుండేవారు. ఎవరికి ఎవరూ సంబంధం లేకుండా, లైఫ్ ను లీడ్ చేస్తూ, టెక్నాలజీని జీవితంలో భాగం చేసుకుంటూ ప్రయాణం చేసేవారు. ఇదంతా 2020 కి ముందు. 2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా మహమ్మారి ఎటాక్ చేయడం మొదలయ్యాక ఆ పరుగులు ఆగిపోయాయి.
ఇలాంటి లైఫ్ ను మళ్లీ చూడగలమా… నెటిజన్ల ఆవేదన…
6 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె.. తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించారు.
వైసీపీ నేతలకు నారా భువనేశ్వరి కౌంటర్
7ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే కి సర్వం సిద్ధం అవుతోంది. జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపకల్పన చేశారు.
జగన్ బర్త్ డేకి సర్వం సిద్ధం.. స్పెషల్ సాంగ్స్ రెడీ
8 వ్యాపారంలో సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో చాలా రకాల బుక్స్ చాలా ఉపయోగపడుతుంటాయని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. 2021 బిజినెస్ ఇయర్‌ని అర్థం చేసుకోవడానికి.. 2022కి సన్నద్ధం కావడానికి ముకేష్ అంబానీకి ఐదు పుస్తకాలు సాయపడ్డాయట.
ఆ ఐదు పుస్తకాలు ముఖేష్ అంబానీకి హెల్ప్ అయ్యాయట..
9 తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటని ఒప్పుకోక తప్పదు. ఈ రియాలిటీ షో తొలి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, ఆ తర్వాత మూడు సీజన్స్ ను నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారంతో ఐదవ సీజన్ పూర్తి అయింది. సన్ని టైటిల్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే మొత్తం ఐదు సీజన్స్ ను పరిశీలిస్తే కంటెస్టెంట్స్ పరంగా ఆసక్తి తగ్గుతూ వచ్చిందన్నది వాస్తవం
బిగ్ బాస్ క్రేజ్ తగ్గుతూ వస్తోందా!?
10 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించిన ఆసీస్… రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473/9 డిక్లేర్డ్ భారీ స్కోరు చేసింది. లబుషేన్ (103), కెప్టెన్ స్మిత్ (93) రాణించారు. బెన్ స్టోక్స్ 3 వికెట్లు సాధించాడు.
యాషెస్ సిరీస్: రెండో టెస్టులోనూ ఆసీస్‌దే విజయం
