అక్టోబర్ 29, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు సానుకూలతకు బాగా శ్రమించాలి. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థల వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
మిథునం : ఈ రోజు ఈ రాశివారు విదేశాలకు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలం. దైవ సేవా రంగాల్లో మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. మీ అభిరుచి ఆశయాలకు తగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు. విద్యార్థులకు దుందుడుకుతనం అధికమతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కన్య : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాలలో మెలకువ అవసరం. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
తుల : ఈ రోజు ఈ రాశివారు కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. బంధువులలో మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులకు ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులకు లోనవుతారు. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. పై అధికారులు, ప్రముఖలతో వాగ్వివాదాలకు దిగకండి. దాన ధర్మాలు చేయడంవల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు పనిభారం అధికమతుంది. విద్యార్థులు స్వయంకృషితో రాణిస్తారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి ధనం బాగా అందుట వలన ఏ కొంతైనా నిల్వచేయగలుగుతారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం.
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!