నవంబర్ 18, గురువారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలుగకుండా వ్యవహరించండి.
వృషభం : ఈరోజు ఈ రాశిలోని రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
మిధునం : ఈ రోజు ఈ రాశివారిఇ బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రిప్రజెంట్లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో చికాకులు, పనిభారం, అధికారుల నుంచి ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సిమెంటు, ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి వారి రంగాలలో చురుకుదనం కానవస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఇతరులజోక్యం వలన వాయిదాపడతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని పొగాకు, ప్రత్తి రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. దైవదీక్షలు స్వీకరిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి ఒక శుభకార్యం నిశ్చయంకావటంతో కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు.
కన్య : ఈ రోజు ఈ రాశివారు ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. విదేశీవస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. లౌకికంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం.
తుల : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికం. మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహరాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి. బంధువుల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు వృతిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించుకోవటం శ్రేయస్కరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. దైవకార్యాలపట్ల ఆసక్తి నెలకొంటుంది. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడతారు. మీ కష్టం ఫలించటంతో అనిర్వచనీయమైన ఆనందం పొందుతారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారి అవసరాలు, బలహీనతలను ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. మీ జీవిత భాగస్వామి ప్రోద్వలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు.
తాజావార్తలు
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!