డిసెంబర్ 8, బుధవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. గృహంలో ఏదైనా వస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం విరమించుకోవటం మంచిది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. మీ యత్నాల్లో పొరపాట్లు దారే ఆస్కారం ఉంది.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
మిథునం : ఈ రోజు ఈ రాశివారికి రావలసిన ధనం అతికష్టం మీద వసూలవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు తల పెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. కొంతమంది మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. ఉద్యోగస్తులు స్థానమార్పిడి కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
కన్య : ఈ రోజు ఈ రాశివారు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒడిదుడుకులు వంటివి ఎదుర్కొంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ప్రముఖులు, అయిన వారిని కలుసుకుంటారు.
తుల : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనివ్వగలవు. సమయానికి సహకరించని మిత్రుల వల్ల ఒకింత ఇబ్బందులెదుర్కుంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. స్త్రీలకు బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైన మార్పులుంటాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత లోపిస్తుంది. మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధు మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని వ్యవసాయ రంగాల వారికి నూతన ఆలోచలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. రావలసిన ధనం అందకపోవటంతో ఇబ్బందులు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారు భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో పనులు వేగవంతమవుతాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారికి బ్యాంకింగ్ వ్యవహారాలు, సంప్రదింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహరాలు ప్రగతిపథంలో నడుస్తాయి. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఆటు పోట్లు తప్పవు. ఫ్యాన్సీ, మందులు, ఎరువుల వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ, పుణ్య, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. స్త్రీల మనోవాంఛలు నెరవుగలవు. ఉమ్మడి వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. కళ, క్రీడా రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
తాజావార్తలు
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!