డిసెంబర్ 22, బుధవారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని పోర్టు, ట్రాన్సుపోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్య వ్యవహారాలను మరింత వేగవంతం చేస్తారు. కలప, ఐరన్, సిమెంటు, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు విలాస వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో, అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. నూతన బాధ్యతలను అంగీకరించే ముందు జాగ్రత్త ఆలోచించండి. ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
Also Read
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
మిధునం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. రాబడికి తగినట్లు ఖర్చులుండటం వల్ల ఇబ్బందులుండవు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు బాగా కృషి చేయాల్సి ఉంటుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని చేతివృత్తుల వారికి సదవాశాలు లభిస్తాయి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను కలిగిస్తాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం మందిదికాదు. దంపతులకు సంతాన యోగం. మీరు చేసే పనికి ఫలితం మరోరకంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని మార్కెట్ రంగాల వారు టార్గెట్లను పూర్తి చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభించదు. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు.
కన్య : ఈ రోజు ఈ రాశివారికి స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, తిను బండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఏకాగ్రత లోపించటం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. వస్త్ర,బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. కష్ట సమయంబలో మిత్రులకు అండగా నిలుస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో మెలకువ వహించండి. వ్యాపారాలకు కావలసిన పెట్టుబడి సమకూర్చుకుంటారు. వాహనం, గృహోపకరాణాలు అమర్చుకుంటారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారిని కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు నిరుత్సాహపరుస్తాయి. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్రైమ్లు మంజూరవుతాయి. వైద్య రంగాల వారికి చికాకులు, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.
మకరం : ఈ రోజు ఈ రాశివారు అర్థాంతరంగా నిలిపి వేసిన పునఃప్రారంభమవుతాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెలకొంటుంది. గృహనిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. లోపాయికారిగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. రుణయత్నాల్లో అనుకూలత, చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!