పేదల వైద్యం కోసం ప్రభుత్వాలు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులను నిర్మిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను నిర్మాణాలు చేస్తోంది. ఇందు కోసం కోట్టాది రూపాయాలు కూడా ఖర్చలు చేస్తున్నారు. అయినా.. రోగులకు అవసరం అయిన మౌలిక సదుపాయాలు మాత్రం ఉండడం లేదు. రూ.400 కోట్లతో నిర్మించిన ఓ ఆసుపత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని రోగులు ఆరోపిస్తున్నారు.
Also Read:Keeravani: నా ఫస్ట్ ఆస్కార్ రామ్ గోపాల్ వర్మతో పని చెయ్యడమే… అతని వల్లే అందరికీ తెలిసాను
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ జిల్లాలో అతిపెద్ది. అక్కడ ఇటీవల 1,000 పడకల ఆసుపత్రిని నిర్మించారు. అయితే, శ్రీకిషన్ ఓజా (65) అనే వృద్ధుడికి కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రికి వచ్చిన ఒక వృద్ధుడిని స్ట్రెచర్ లేకపోవడంతో ఆయనను ఒక గుడ్డ ముక్కపై కూర్చున్నప్పుడు నేలపైకి లాగవలసి వచ్చింది. జయరోగ్య ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించిందీ దృశ్యం. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో వృద్ధుడి బంధువు అయిన మహిళ.. ఆయనను తెల్లటి బెడ్‌షీట్‌పై కూర్చుపెట్టి నేలపై లాక్కొని వెళ్లింది.
Also Read:NTR 30: ‘ఎన్టీఆర్ 30’ కోసం ‘మిషన్ ఇంపాజిబుల్’ యాక్షన్ మాస్టర్
ఆర్థోపెడిక్ విభాగంలోని వైద్యులు శ్రీకిషన్ ఓజా (65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. అతని కోడలు స్ట్రెచర్ కోసం వెతుకుతూ వెళ్లింది కానీ దొరకలేదు. ఆమె తర్వాత రెండు స్ట్రెచర్లను చూసింది, కానీ వాటికి చక్రాలు లేవు. ఆ తర్వాత ఆమె ఒక బెడ్‌షీట్ తెచ్చి, తన మామగారిని మెయిన్ డోర్ దగ్గరకు లాగి, అక్కడి నుంచి ఆటోరిక్షాను తీసుకుని ట్రామా కేర్ డిపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది.
కాగా, శ్రీకిషన్ ఓజా (65) సైకిల్‌పై నుండి పడిపోయాడు. దీంతో ఆయన కాలుకి గాయమైంది. తాము గ్వాలియర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న భింద్ జిల్లా నుండి వచ్చామని బాధితుడు చెప్పారు. స్ట్రెచర్లు ఉన్నా చాలా మందికి వర్కింగ్ వీల్స్ లేవని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. 400 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని రోగులు వాపోతున్నారు.
