దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా, ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read: Live: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమయ్యి యానంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నది.