గత 2 సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో భయాందోళన సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తి తగ్గడం లేదు. కరోనా కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలు విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఇప్పడు మరోసారి ప్రపంచ దేశాలు సైతం భయాందోళన చెందుతున్నాయి.
అయితే తాజాగా ఇండియాలో 6,987 కరోనా కేసులు రాగా, 162 మంది కరోనా సోకి మరణించారు. అయితే ప్రస్తుతం 76,766 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఇటీవల భారత్లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య అధికంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు చేరింది.