తెలంగాణలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులో ఉండనుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 2019-2021 మద్యం షాపుల లైసెన్స్ ముగియడంతో కొత్త మద్యం దుకాణాలకు తెలంగాణ సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లకు దరఖాస్తు చేసుకునే వారికి రూ.2లక్షల రుసుము విధించింది. ఈ నేపథ్యంలో 2,620 మద్యం దుకాణాలకు గాను 48 మినహా మిగతా దుకాణాలకు లైసెన్స్ లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
2017-19 పాలసీ కాలం లో డిపోల నుండి రూ.40,837 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా, 2019 నవంబర్ ఒకటి నుండి 2021 నవంబర్ 30 వరకు డిపోల నుండి రూ. 56,769 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా అంతకు ముందు పాలసీతో పోల్చుకుంటే సుమారు రూ.16 వేల కోట్లు అధికంగా అమ్మకాలు జరిగాయన్నారు. నవంబర్‌లో ప్రభుత్వంకి మద్యం అమ్మకాలు, లైసెన్స్ ఫీ, దరఖాస్తు ఫీ రూపంలో రూ.4 వేల కోట్ల కు పైగా ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఇందులో దరఖాస్తుల ద్వారా రూ.1,357 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా రూ.2,187 కోట్లు ఆదాయం వచ్చినట్లు స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!