తెలంగాణలో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులో ఉండనుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 2019-2021 మద్యం షాపుల లైసెన్స్ ముగియడంతో కొత్త మద్యం దుకాణాలకు తెలంగాణ సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లకు దరఖాస్తు చేసుకునే వారికి రూ.2లక్షల రుసుము విధించింది. ఈ నేపథ్యంలో 2,620 మద్యం దుకాణాలకు గాను 48 మినహా మిగతా దుకాణాలకు లైసెన్స్ లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు…