NTV Telugu Site icon

వైసీపీ నేతలకు నారా భువనేశ్వరి కౌంటర్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె.. తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించారు.. 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల చొప్పున చెక్కుల‌ను అందించారు.. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరిని.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. రాజకీయాలు నేను మాట్లాడను అంటూనే వైసీపీకి కౌంటర్‌ ఇచ్చారు భువనేశ్వరి..

Read Also: ఒమిక్రాన్‌ కల్లోలం.. అక్కడ 12 మంది మృతి..

ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదంటూ వైసీపీ నేతలకు కౌంటర్‌ ఇచ్చిన నారా భువనేశ్వరి.. పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. సమాజానికి ఉపయోగం లేని విమర్శలెందుకు? అని ప్రశ్నించిన ఆమె.. అతి పెద్ద రాష్ట్రాన్ని నా భర్త ఏ విధంగా అభివృద్ధి చేశారో నాకు తెలుసన్నారు.. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేసుకున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలి… ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. నా భర్త పనితీరు ఏంటో ప్రజలకు తెలుసు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల విమర్శలను పట్టించుకోం.. బాధపడమని.. ప్రజాసేవకే అంకితమవుతామని వెల్లడించారు నారా భువనేశ్వరి. కాగా, అసెంబ్లీలో వైసీపీ నేతల కామెంట్లు.. నా భార్యను అవమానించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కంటతడిపెట్టడం.. ఇక, టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.