కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుని ఇప్పుడిపుడే సినిమాల విడుదలలు ఊపందుకుంటున్నాయి. గత వారం ‘పాగల్, రాజరాజచోర’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా ఈ వారం ‘శ్రీదేవి సోడాసెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు’ పలకరించాయి. వచ్చే వారం ‘సీటీమార్’, ఆ పై వారం ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతున్నాయి. ఇక ‘లవ్ స్టోరీ’ విడుదలవుతున్న రోజునే ఓటీటీలో నాని నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్ ని అధికారికంగా ప్రకటించారు.
Read Also: ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా!?
అయితే వినాయక చవితి సంధర్భంగా ‘టక్ జగదీష్’ చిత్రాన్ని సెప్టెంబర్ 10న ఓటీటీలో విడుదల చేస్తారని గత కొంతకాలంగా వినిపించింది. దీనిని మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ… అదే రోజున ‘లవ్ స్టోరీ’ని థియేట్రికల్ రిలీజ్ చేస్తుండటంతో నాని మూవీ ఓటీటీ విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పండగ సమయాల్లో థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకు పోటీగా ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయటం కరెక్ట్ కాదని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఖండించింది. నాని సినిమాని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో అందరి దృష్టి ఈ వివాదంపై పడింది.
Read Also: రివ్యూ : ఇచ్చట వాహనములు నిలుపరాదు
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని నిర్మాతల శ్రేయస్సు కోసం రిలీజ్ నిర్ణయం వాళ్ళకే వదిలేశానని నాని ప్రకటించాడు. ఆర్ధిక పరిస్థితులు బాగాలేకపోవడంతో డిజిటల్ రిలీజ్ కోసం నాని ని ఒప్పించామని మేకర్స్ తెలిపారు. ఇక కొంత మంది ఎగ్జిబిటర్స్ అయితే ఏకంగా నానిపై పరోక్ష విమర్శలకు దిగారు. కొంత మంది ఎగ్జిబిటర్స్ ‘నాని స్టేజ్ పై చెప్పేది ఒకటి… వెనక చేసేది మరొకటి అంటూ డైరక్ట్ ఎటాక్ కి దిగటమే కాదు నిర్మాణంలో ఉన్న నాని సినిమాలకు నాన్ కోఆపరేషన్’ అని అనేశారు. దీంతో రంగంలోకి దిగిన యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగటం సరికాదని హెచ్చరించారు.
Read Also: రివ్యూ : శ్రీదేవి సోడా సెంటర్
సినిమా తీసిన నిర్మాతలు తమ సినిమాలను ఎప్పుడైనా ఎలాగైనా విడుదల చేసుకునే హక్కు ఉంటుందన్నారు. ఇప్పుడు వినాయకచవితి కానుకగా ‘టక్ జగదీష్’ ను ‘లవ్ స్టోరీ’ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న సెప్టెంబర్ 10నే విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సినిమాను పండక్కి ఫ్యామిలీతో కలిసి చూడమని నాని ట్వీట్ చేసాడు. ‘భూదేవిపురం నాయుడు గారి అబ్బాయి టక్ జగదీష్ చెప్తున్నాడు.. మొదలెట్టండి’ అంటూ ప్రచార పర్వం సాగించాడు. నాని అండ్ కో వెనక్కి తగ్గకపోవడంతో సెప్టెంబర్ 10న థియేటర్ vs నాని మధ్య పోటీ అనివార్యం అయింది. మరి ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఏ స్టెప్ తీసుకుంటారు? ఈ పోటీలో విన్నర్ గా నిలిచేది ఎవరు? ఈ విషయాలకు సమాధానం తెలియాలంటే సెప్టెంబర్ 10 వరకూ ఆగాల్సిందే.