యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ‘నాటు నాటు’ సాంగ్ మొత్తానికీ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వచ్చిన పాట కావడం, పైగా ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులేయడంతో సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో సెగలు రేపి, భారీ అంచనాలను నమోదు చేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఓ భారీ భవంతి ముందు, మ్యూజ్ సెటప్ లో ఈ సాంగ్ ను ఈ పాటను తెరకెక్కించి, రాజమౌళి కనువిందు చేశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీకి తగ్గట్టుగా ఎన్టీయార్, చెర్రీ వేసిన స్టెప్స్ సాంగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి.
Read Also : బిగ్ బ్రేకింగ్: పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్..
చంద్రబోస్ తనదైన శైలిలో అంత్య ప్రాసలతో రాసిన ఈ పాటను అంతే జోష్ తో రాహుల్ సిప్లిగంజ్ తో పాటు కీరవాణి తనయుడు కాలభైరవ పాడటం విశేషం. కీరవాణి సమకూర్చిన స్వరాలు వీనుల విందుగా ఉంటే, సెంథిల్ సినిమాటోగ్రఫీ ఐఫీస్ట్ ను కలిగించింది. డీవీవీ దానయ్య అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్ వాల్యూస్ సైతం ఈ పాటలో కనిపిస్తున్నాయి. డాన్సింగ్ డైనమేట్స్ తో లెగ్స్ షేక్ చేసే టైమ్ వచ్చిందని రాజమౌళి చెప్పినట్టుగానే ఈ పాటకు కోట్లాది మంది తమ లెగ్స్ షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఎన్టీఆర్, చెర్రీతో పాటు ఒలివియా మోరిస్ సైతం స్టెప్టులేయడం ఈ సాంగ్ లోని మరో హైలైట్. కోట్లాది మందికి ఈ పాట కాలర్ ట్యూన్ కావడమే కాదు, ఈ పాటలో మన హీరోలు వేసిన సిగ్నేచర్ స్టెప్ ను అనుకరిస్తూ, డిజిటల్ మీడియాపై వారి అభిమానులు దాడి చేయడం ఖాయం. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టించడం మొదటి నిమిషం నుండే మొదలు పెట్టేసింది. ఈ పాటకు జనవరి 7న థియేటర్లు ఏ స్థాయిలో దద్దరిల్లిపోతాయో ఇప్పటి నుండే ఊహించుకోవచ్చు!