మయన్మార్‌లో ఓ గ్రామంపై సైన్యం విరుచుకుపడింది. వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది మరణించారు. పాజిగై గ్రామంపై వైమానిక దాడిని నిర్వహించారు. మృతుల్లో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు.సైనిక పాలనను వ్యతిరేకించే వర్గం గ్రామంలో చేపట్టిన కార్యక్రమమే లక్ష్యంగా సైన్యం వైమానిక దాడులు చేసింది. దాదాపు 150 మంది గుంపుపైకి ఫైటర్ జెట్ నేరుగా బాంబులు పడ్డాయి. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు ఉన్నారని, చనిపోయిన వారిలో స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు.
Also Read:Karnataka: మాజీ సీఎంకు దక్కని టికెట్.. బీజేపీకి జగదీష్ షెట్టర్ సవాల్
పాజిగై గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం మంగళవారం ఉదయం 8 గంటలకు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సరిగ్గా ఆ సమయంలో సైన్యం వైమానిక దాడులు చేసింది. దాడి విషయాన్ని సైనిక ప్రభుత్వ అధికార ప్రతినిధి ధృవీకరించారు.
Also Read:Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవీ..
కాగా, ఫిబ్రవరి 2021లో సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి.
2021లో సైనిక తిరుగుబాటుతో దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చిన సాయుధ వ్యతిరేక సమూహాలలో పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఒకటి.