డబ్బును సంపాదించడం కాదు…సంపాదించిన డబ్బును పొదుపుగా వాడుకోవడం తెలిసుండాలి. పొదుపుగా వాడుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఎదైనా అత్యవసరం అయినపుడు పొదుపులోనుంచి వాడుకోవాలి. జపాన్‌లో కొన్ని శతాబ్దాలుగా డబ్బును పొదుపుగా వాడుకునేందుకు కకేబో అనే పద్దతిని ఫాలో అవుతుంటారు. వచ్చిన డబ్బును ఎలా ఖర్చుచేయాలి. దేనికి ఎంత ఖర్చు చేయాలి అనే వివరాలతో సమగ్రంగా పుస్తంలో రాసుకుంటారు. అవసరాలు ఏంటి? అనవసరాలు ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఫలితంగా నెలవారి ఆదాయం నుంచి సుమారు 35 శాతం మేర మిగులుతుంది.
Read: వాల్‌మార్ట్ కీలక నిర్ణయం: డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీకి శ్రీకారం…
కకేబో అంటే జపాన్ భాషలో ఇంటిపద్దు పుస్తకం అంటారు. ఇంటి ఆదాయ వ్యయాలను నమోదు చేయడం అన్నమాట. పుస్తకంలో ఖర్చులు, పోదుపు లక్ష్యాలు, కొనుగోళ్ల ప్రాథాన్యాలు, నెలవారీ సమీక్షలు అన్నింటిని పొందుపరుచుకోవాలి. క్రమంగా అవసరం లేనివి పక్కన పెడుతుండాలి. క్రమం తప్పకుండా పొదుపు పుస్తకాన్ని ఫాలో అయితే ఖర్చులను తగ్గించుకోవచ్చు. నెలవారి ఖర్చులపై నియంత్రణ సాధించవచ్చు.
వచ్చిన డబ్బును అవసరాలు ఏంటి? కోరికలు ఏంటి? కల్చర్ ఏంటి? అనుకోని ఖర్చులు ఏంటి అనే నాలుగు విధాలుగా విభజించాలి. ఏవి అవసరమో, ఏవి కాదో తెలిపోతుంది. అదేవిధంగా మీదగ్గర ఎంత డబ్బు ఉంది? ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారు? ఎలా దాన్ని మెరుగుపరుచుకుంటున్నారు? తదితర విషయాలతో కూడిన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. అలా ఆ నిర్ణయం ప్రకారం ఖర్చు చేసుకుంటే డబ్బును ఆదాచేసుకోవచ్చు.