వాల్‌మార్ట్ కీల‌క నిర్ణ‌యం: డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివ‌రీకి శ్రీకారం…

ప్ర‌ముఖ షాపింగ్ మాల్ సంస్థ వాల్‌మార్ట్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వినియోగ దారుల‌కు డ్రోన్ ద్వారా పుడ్ డెలివ‌రీ చేయాల‌ని నిర్ణ‌యించింది.   అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ మొద‌ట యూఎస్‌లోని ఆర్కాన్సాస్ పీరిడ్జ్‌లో ప్రారంభించింది.  పీరిడ్జ్ నుంచి 50 మైళ్ల దూరం వ‌ర‌కు ఈ సేవ‌లు అందుబాటులో ఉంటాయి.  ఫుడ్ తో పాటుగా వాల్ మార్ట్ సంస్థ 26 ర‌కాల వ‌స్తువుల‌ను క‌మ‌ర్షియ‌ల్ డ్రోన్ డెలివ‌రీ ద్వారా అంద‌జేసేందుకు ముందుకు వ‌చ్చింది.  

Read: టెక్ దిగ్గ‌జం యాపిల్ కంపెనీ ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?

దీనికోసం ఈ సంస్థ అటాన‌మ‌స్ జిప్‌లైన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది వాల్‌మార్ట్‌.  జిప్‌లైన్ డ్రోన్లు పారాచూట్ లాడెన్ ప్యాకేజీల‌ను క‌స్ట‌మ‌ర్ల చేతికి అందేలా డ్రాప్ చేస్తాయి.  ఈరోజు నుంచి వాల్‌మార్ట్ క‌మ‌ర్షియ‌ల్ డ్రోన్ ఫుడ్ డెలివ‌రీకి శ్రీకారం చుట్టింది.  ఇక డెలివ‌రీ చేసే వ‌స్తువుల బ‌రువును బ‌ట్టి 10 డాల‌ర్ల‌ను డెలివ‌రీ ఫీజ్ కింద వ‌సూలు చేస్తామ‌ని, ఆర్డ‌ర్ చేసిన 30 నిమిషాల్లోనే వ‌స్తువులు డెలివ‌రీ అవుతాయ‌ని వాల్‌మార్ట్ సంస్థ తెలియ‌జేసింది. 

Related Articles

Latest Articles