దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో 2716 కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసుల కంటే 51శాతం అదనంగా కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటి రేటు 3.64శాతంగా ఉంది. పాజిటివిటి రేటు 0.5 శాతంగా ఉన్న సమయంలోనే ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. అయితే, ఇప్పుడు పాజిటివిటి రేటు 3.64 శాతానికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్కూళ్లు, సినిమా హాళ్లను ఇప్పటికే మూసేయించారు. ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. 50 శాతంతో ఆఫీసులు నడుస్తున్నాయి. రెస్టారెంట్లు కూడా 50 శాతం సీటింగ్‌తో నడుస్తున్నాయి.
Read: మొదలైన బాదుడు… ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 21 సర్వీస్ చార్జ్…
ఇక ఇదిలా ఉంటే, అటు ముంబై నగరంలోనూ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ముంబైలో 6,347 కొత్త కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 వ తేదీన 5,631 కేసులు నమోదవ్వగా ఆ రికార్డును అధికమించి 6,347 కేసులు శనివారం రోజున నమోదయ్యాయి. ముంబైలో భారీగా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని అదేశాలు జారీ చేశారు. ముంబైలో రాత్రి కర్ఫ్యూతో పాగు ఉదయం మహానగరంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.