పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో ఎన్డీయే ప్రభుత్వంలో పర్యావరణ, అటవీశాఖ వాతావరణ మార్పుల సహాయశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, ఆగస్టులో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడికి, బాబుల్ సుప్రియోకి మద్య రగడ కారణంగానే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న బాబుల్ సుప్రియో, బెంగాల్ ఎన్నికల తరువాత బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తృణమూల్‌లో చేరినప్పటికీ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జెండాపై గెలిచిన తాను ఎంపీగా కొనసాగలేనని, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజీనామా లేఖను రేపు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను కలిసి సమర్పించనున్నారు. బాబుల్ సుప్రియో రాజీనామా చేస్తే బెంగాల్‌లో ఎంపీ స్థానం ఖాళీ అవుతుంది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
Read: శీతాకాలానికి ముందే ఆ గ్రామాన్ని కమ్మేసిన మంచు…