తెలంగాణ జైళ్ళలో మగ్గుతున్న చదువుకున్న యువత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువతరం దేశానికి ఆధారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సామాజిక సేవ చేయాల్సిన యువత వివిధ నేరాలకు పాల్పడి జైళ్ళలో మగ్గుతున్నారు. తెలంగాణ జైళ్ళలో మగ్గుతున్న యువత ధైన్యస్థితి పలువురిని కలచివేస్తోంది. తెలంగాణ జైళ్ళలో ఖైదీలుగా అధిక శాతం యువత జైలు గోడలకే పరిమితం అవుతున్నారు. వివిధ కారణాల వల్ల వారు నేరస్తులుగా మారారు.
2020 నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల్లోని జైళ్ళ డేటాలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విడుదల చేసిన నివేదికలో అధిక శాతం ఖైదీలు గా యువత వున్నట్టు అర్థం అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 37 జైళ్లు వున్నాయి. జైళ్ళలో మొత్తం 6114 మంది ఖైదీలు వున్నారు. వీరిలో 1910 మందికి శిక్షలు ఖరారయ్యాయి. 3946 మంది అండర్ ట్రైల్ ఖైదీలుగా ఉన్నారు. శిక్ష పడిన 1910 మంది ఖైదీల్లో 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ,168 మంది గ్రాడ్యుయేట్లు వున్నారు. వీరిలో కరడు గట్టిన ఖైదీలు తక్కువే. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి, జైలు జీవితం గడుపుతున్నవారు అనేకమంది వున్నారు. అండర్ ట్రైల్ ఖైదీలు గా 138 గ్రాడ్యుయేట్లు, 241 పోస్ట్ గ్రాడ్యుయేట్లు వున్నారు.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
అలాగే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జైళ్ళలో ఆక్యుపెన్సీ రేట్ 77.3 శాతంగా వుంది. మొత్తం 6114 మంది ఖైదీల్లో 372 మంది మహిళా ఖైదీలు వున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఖైదీల సంఖ్య తక్కువేనని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలు చెబుతున్నాయి. మొత్తం జైళ్ళలో కెపాసిటీ 7845 , మహిళలు 703 కాగా 78 శాతం లోపే ఖైదీలు వున్నారు.
హర్యానాలో 94.9 శాతం, కర్నాటకలో 92.5 శాతం, అరుణాచల్ ప్రదేశ్‌లో 76 శాతం, పంజాబ్‌లో 73.3 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 69.5 శాతం, కేరళలో 61.1 శాతం, మిజోరాంలో 46.7 శాతం, త్రిపురలో 44.1 శాతం, తమిళనాడులో 43.5 శాతం, లడక్‌లో 32.5 శాతం, నాగాలాండ్‌లో 28.4 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ వుంది. మొత్తం ఖైదీల్లో తెలంగాణ జైళ్ళలో 12 శాతం మంది శిక్షలు ఖరారైన వారు, 23 శాతం మంది అండర్ ట్రయల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారున్నారు. ఇద్దరు పాకిస్తాన్, ముగ్గురు నైజీరియన్లకు శిక్ష ఖరారయింది. మొత్తం అండర్ ట్రయల్స్‌లో ఇద్దరు పాకిస్తాన్, నలుగురు చైనా వారితో సహా 37 మంది విదేశీయులు వివిధ కారాగారాల్లో వున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!