ఖరీదైన విడాకులు.. భరణంగా రూ.5,555 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడాకుల తర్వాత భార్యకు భరణం చెల్లించే విషయంలోనూ కొత్త రికార్డు సృష్టించాడు దుబాయ్‌కి చెందిన ఓ రాజు.. బ్రిటన్ హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పుతో.. ఆయన తన మాజీ భార్యకు ఏకంగా రూ.5,555 కోట్లను భరణంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం వయస్సు 72 ఏళ్లు.. ఆయన భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుసేన్ వయస్సు 47 ఏళ్లు.. ఈ ఇద్దరి విడాకుల కేసు విచారణ జరిపిన బ్రిటన్ హైకోర్టు.. తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. షేక్ మహమ్మద్-హయాకు పుట్టిన పిల్లలకు 554 మిలియన్ పౌండ్లు భరణంగా చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పు చెప్పింది.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. ఆ మొత్తం రూ.5,555 కోట్లు అన్నమాట.
Read Also: చలిపంజా.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. 4.6గా కనిష్ఠ ఉష్ణోగ్రత..
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
బ్రిటిష్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన విడాకులు ఇవేనని చెబుతున్నారు.. ఇక, ఈ మొత్తంలో మొదట రూ.2,521 కోట్లు మాజీ భార్యకు 3 నెలల్లోపు చెల్లించాలని.. మిగతా రూ.2,907 కోట్లు వారి ఇద్దరి సంతానమైన 14 ఏళ్ల అల్ జలీలా, 9 ఏళ్ల జయేద్‌కు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాలని తన తీర్పులో స్పష్టం చేసింది బ్రిటన్ కోర్టు.. అంతేకాదు.. పిల్లలకు ఇవ్వాల్సిన మొత్తం తండ్రితో వారికున్న సంబంధాలపై ఆధారపడి ఉంటుందని కూడా పేర్కొంది.. మాజీ భార్య, పిల్లల రక్షణ ఖర్చుల కింద ప్రతీ ఏడాది రూ.110 కోట్లు, పిల్లల చదువుల కోసం మరికొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.. ఈ కేసు విచారణ తర్వాత తీర్పు వెలువరించిన కోర్టు.. రాకుమారి హయా, ఆమె పిల్లలకు బయటి వ్యక్తుల నుంచి కంటే భర్త షేక్ మహమ్మద్ నుంచే ఎక్కువ ముప్పు ఉందని అర్థమవుతోందని.. వారికి తగినంత రక్షణ అవసరమని పేర్కొంది. కాగా, రాకుమారి హయా 2019లో దుబాయ్ నుంచి తిరిగి లండన్‌కు వెళ్లిపోయారు.. ఆ తర్వాత విడాకుల కోసం కోర్టుకెక్కారు.. తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని బ్రిటిష్ కోర్టును ఆశ్రయించారామె.. అప్పటి నుంచి విచారణ జరుగుతూ రాగా.. తాజాగా సంచలన తీర్పు వెలువరించింది హైకోర్టు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!