సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు నటుడు సోనూసూద్ సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. సోమవారం హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో కోవిడ్ వారియర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా… మంత్రి కేటీఆర్, నటుడు సోనూసూద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతడిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే సోనూసూద్ ఇళ్లపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించారని విమర్శలు చేశారు.
Read Also: మారనున్న మెట్రో టైమింగ్స్.. ఉదయం 6 గంటలకే మెట్రో కూత?
Also Read
అంతేకాకుండా సోనూసూద్ వ్యక్తిత్వాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి వారికి సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని.. సోనూ వెనుక తాముంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కరోనా కష్టకాలంలో సోనూసూద్ తన సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని, తన సేవలతో ప్రపంచం దృష్టి ఆకర్షించారని కేటీఆర్ కొనియాడారు. కోవిడ్‌తో చాలా మంది ఉద్యోగాలు, చదువులతో పాటు ఆత్మీయులను కోల్పోయారని… అలాంటి వాళ్లకు సహాయపడటం చాలా గొప్ప విషయం అన్నారు. విపత్తు సమయాల్లో అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదని.. అలాంటప్పుడు స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!