జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు దుమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు.. తెలుగుదేశం పార్టీ తో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని సూచంచిన ఆయన.. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటి చేసే దమ్ము లేదు.. ఇక, జనసేన పార్టీ ఎంత? ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా టీడీపీ పోటీ చేసిందా? అంటూ ప్రశ్నించారు మంత్రి బాలినేని.. కాగా, పరిషత్ ఎన్నికల తర్వాత జనసేన, టీడీపీ కలిసి ఓ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.. ఈ సందర్భంగా కొందరు టీడీపీ సీనియర్ నేతలు టీడీపీ, జనసేన కలిసి పోటీచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు.. ప్రస్తుతం ఏపీలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సవాల్ చర్చగా మారింది.
పవన్ కల్యాణ్‌కి మంత్రి బాలినేని సవాల్..
