దుబాయ్ సృష్టించిన మ‌రో అద్భుత లోకం…

దుబాయ్ లో దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎగ్జిబిష‌న్ జ‌రుగుతున్న‌ది. అక్టోబ‌ర్ 1 వ తేదీ నుంచి వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు ఆరు నెల‌ల‌పాటు ఈ ఎగ్జిబిష‌న్ జ‌రుగనున్న‌ది. దీనికోసం దుబాయ్ ఎడారి ప్రాంతంలోని 1080 ఎకరాల్లో వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి ఓ అద్భుత‌లోకాన్ని సృష్టించింది.  192 దేశాలు ఈ ఎగ్జిబిష‌న్‌లో పాల్గొన‌బోతున్నాయి.    ఆసియాలో జ‌ర‌గ‌బోతున్న తొలి అంత‌ర్జాతీయ ఎక్స్ పో కావ‌డంతో ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి భారీ అంత‌ర్జాతీయ ఎక్స్‌పోల‌ను యూర‌ప్‌, అమెరికాలో మాత్ర‌మే నిర్వ‌హించారు.  2020లోనే ఈ ఎక్స్‌పో జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.  ఆఫ్రికన్ ఫుడ్ హాల్, 20 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల పొడవైన ఇటలీ తాడు, ఈజిప్షియన్ మమ్మీ, స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రెప్లికా, టాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్ హీరో డేవిడ్ త్రీడీ బొమ్మ, అమెరికా మూడవ అధ్యక్షుడు వాడిన పవిత్ర ఖురాన్ వంటివి అనేకం ఈ ఎక్స్‌పోలో క‌నువిందు చేయ‌బోతున్నాయి.  

Read: భ‌వానీపూర్‌లో దూసుకుపోతున్న దీదీ…

-Advertisement-దుబాయ్ సృష్టించిన మ‌రో అద్భుత లోకం...

Related Articles

Latest Articles