మహాత్ముడి జయంతి.. అహింసే ఆయన మార్గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ… ఆయనే మహాత్మా గాంధీ.. 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించిన ఆయన.. జాతిపితగా అందరూ గౌరవించే స్థానానికి ఎదిగారంటే.. ఆయన నమ్మిన సత్యం, అహింస సిద్ధాంతాలు.. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం లాంటి ఆయుధాలు.. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే నంటూ ఆయన వేసిన అడుగులే కారణం.. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా ఆ మహాత్ముడిని కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారంటూ.. ఎప్పటికీ ఆయన అందరి గుండెల్లో నిలిచిపోయే జాతిపిత. ఇవాళ ఆయన 152వ జయంతి సందర్భంగా ఓసారి మళ్లీ ఆయనను స్మరించుకుందాం..
గుజరాత్ లో ఓ సామాన్య మానవునిగా పుట్టిన గాంధీజీ.. తెల్లదొరలను శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు అనేక రూపాల్లో పోరాటాలు చేశారు… కానీ, ఎప్పుడు తాను నమ్మిన సత్యం, అహింస సిద్ధాంతాలను మాత్రం వీడలేదు.. యావత్ భారతావని అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది. కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారు.. చివరకు ఆయన ప్రపంచానికే ఆదర్శమూర్తి అయ్యారు.. ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు ఆయన.. ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు, వాటిని ఉపయోగించడానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. చేత కర్రబట్టి.. ఆ కర్రను యుద్ధానికి ఉపయోగించకుండానే.. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించినా, మగ్గం చేతబట్టి నూలు వడికినా, చీపురు అందుకొని మురికివాడలు శుభ్రం చేసినా ఆయనకే చెల్లింది.. ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని ఏకతాటిపైకి తీకొస్తూ ముందుకు కదిలిన ఆయన.. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేశారు..
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ఇక, గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న.. కరంచంద్ గాంధీ, పుత్లీ బాయిదంపతులకు జన్మించారు.. గాంధీజీ మొదట్లో చదువులో అంతగా చురుకైన విద్యార్థి కాదు.. ఈ విషయాన్ని ఆయనే తన ఆత్మకథ ‘My Experiments With Truth’లో స్వయంగా రాసుకొచ్చారు.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు.. క్లాస్ రూమ్‌లో ఎక్కువ బియడంతో వెనుక వరసలో కూర్చొనే ఆయన.. ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియవాడ్‌లో పూర్తి చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా వెళ్లారు.. అక్కడే ఆయన పోరాటం ప్రారంభమైంది.. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి దేశాన్నంతటినీ ఏకదాటిపైకి తెచ్చి స్వాతంత్య్రం సంపాదించి పెట్టడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది.. భారత్‌పై చెరగని ముద్ర వేసి.. జాతిపిత అయ్యారు. ఇక, 1947, అక్టోబర్ 2 స్వతంత్ర భారతంలో గాంధీజీ తొలి, ఆఖరు (78వ) పుట్టినరోజు.. ఢిల్లీలో జరిగిన ప్రార్థన సమావేశంలో మహాత్ముడు ఉద్వేగంతో మాట్లాడుతూ.. ఉపవాసం… నూలు వడకటం… ప్రార్థన… పుట్టినరోజు జరుపుకొనే సరైన పద్ధతి ఇదేనన్నది నా భావన.. మీ అందరికీ ఇవాళ నా పుట్టినరోజు. నాకు మాత్రం సంతాప దినం! ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యంగానూ, సిగ్గుగానూ ఉంది. ఇన్నాళ్లూ లక్షల మంది నా మాట మీద నడిచారు.. ఇవాళ ఒక్కరూ నా మాట వినటం లేదు. నిజంగా నా పుట్టిన రోజు సంబరంగా చేసుకోవాలనే మీకుంటే… మనసుల్లోంచి విద్వేషభావాన్ని తొలగించుకోండి.. అంటూ ఆయన కుండబద్ధలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని చెప్పెశారు.. కానీ, 1948 జనవరి 30న అత్యంత దారుణంగా ఆయన హత్యకు గురికావాల్సి వచ్చింది.. నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి మహాత్ముడిని కాల్చి చంపాడు. ఇవాళ ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా ఓసారి ఆయను స్మరించుకోవడమే కాదు.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం.
తాజావార్తలు
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!