Site icon NTV Telugu

మ‌హా అసెంబ్లీలో 50 మందికి క‌రోనా…

మ‌హారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ స‌మావేశాలు మంగ‌ళ‌వారంతో ముగిశాయి.  క‌రోనా, ఒమిక్రాన్ నిబంధ‌న‌లను పాటిస్తూ డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు మొత్తం 5 రోజుల‌పాటు స‌మావేశాల‌ను నిర్వ‌హించారు.  శీతాకాల అసెంబ్లీ స‌మావేశాల‌ను నాగ‌పూర్‌లో నిర్వ‌హించాల్సి ఉన్నా, ఒమిక్రాన్ కార‌ణంగా ఈ స‌మావేశాల‌ను ముంబైలోనే నిర్వ‌హించారు. ఐదు రోజుల‌పాటు జ‌రిగిన ఈ స‌మావేశాల స‌మ‌యంలో 50 మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్టు మ‌హా ఉప ముఖ్య‌మంత్రి ప‌వార్ తెలిపారు.  మ‌హారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్, మ‌రో మంత్రి కేసీ పాడ్వికి కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.  అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌ర స‌మ‌యాల్లో విద్యాశాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.  

Read: ఝార్ఖండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు…

విద్యాశాఖ మంత్రికి క‌రోనా సోక‌డంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. క‌రోనా సోకిన 50 మంది ప్ర‌స్తుతం చికిత్స అందిస్తున్నారు. వీరి కాంటాక్ట్‌ను ట్రేస్ చేస్తున్నారు.  గ‌తంలో ఒక‌సారి మంత్రి వ‌ర్షా గైక్వాడ్‌కు క‌రోనా సోకింది.  రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని, త‌గినన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా బారిన ప‌డ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  మ‌హారాష్ట్ర‌లోనే కేసులు అధిక‌సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  క‌రోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.  ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉన్నది.  ముంబైలో నైట్ క‌ర్ఫ్యూతో పాటు 144 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్నారు.  

Exit mobile version