కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు.. కొలిచిన వారికి కొంగుబంగారం అయిన శ్రీవారికి రకరాల పూజలు, అభిషేకలు, ఊరేగింపులు.. కల్యాణాలు.. ఒక్కటేంటి.. శ్రీవారి వైభోగం మాటలకు అందదు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ ఏడాది మరో రోజుతో ముగియనుంది.. వచ్చే ఏడాది అంటే జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం..
Read Also: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..
టీటీడీ వెల్లడించిన వివేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి..
- జనవరి 2వ తేదీన అధ్యయనోత్సవాలు ప్రారంభం.
- 13న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు.
- 14న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ.
- 15న మకర సంక్రాంతి.
- 16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం.
- 17న రామకృష్ణ తీర్థ ముక్కోటి.
- 18న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
- 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
- 26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.
- 27న శ్రీవారు తిరుమలనంబి ఆలయానికి వేంచెపు లాంటి విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.