సంచలన విషయాలు బయటపెట్టిన పాక్ టెర్రరిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన విషయాలు బయటపెట్టిన పాకిస్థాన్ టెర్రరిస్ట్ అలీ బాబర్.. ఉగ్రవాదులను భారత్‌పై ఎగదోసి దాడులు చేసే ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పాక్ యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తూ వారిని భారత్‌లోకి పంపుతోంది. జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో పట్టుబడిన అలీ బాబర్ పాత్ర అనే పాక్ ఉగ్రవాది ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. అతడికి లష్కరే తోయిబాతోపాటు పాకిస్థాన్ ఆర్మీ శిక్షణ ఇచ్చారని… అంతేకాదు బారాముల్లాలోని ఓ ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు ఇరవై వేలు ఇచ్చారన్నాడు.
కాగా, ఉరి సెక్టార్‌లో సెప్టెంబర్ 28న ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. మరో పాక్ ఉగ్రవాదిని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది. ఇలా భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఓ పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. అయితే, పట్టుబడిన ఉగ్రవాది నుంచి కీలక సమాచారం రాబట్టింది భారత సైన్యం. పట్టుబడ్డ ఉగ్రవాదికి ముజఫరాబాద్‌లోని లష్కరే క్యాంపులో శిక్షణ ఇచ్చారని.. అతనితో సహా ఆరుగురు ఉగ్రవాదులు సెప్టెంబర్ 18న భారత్‌లోకి ప్రవేశించారని గుర్తించారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో దాదాపు 70 మంది వరకు పాక్ ఉగ్రవాదులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా నేరుగా దాడుల్లో పాల్గొనకుండా.. స్థానికంగా ఉన్న వారిని దాడుల్లో పాల్గొనేలా రెచ్చగొట్టే వ్యూహాలు అమలు చేస్తారని చెబుతున్నారు. అయితే, మాది పేద కుటుంబం. నాన్న లేడు. వస్త్ర పరిశ్రమలో పనిచేసేవాడిని. ఆ సమయంలో ఐఎస్‌ఐతో సంబంధాలున్న కుర్రాడితో పరిచయం ఏర్పడింది. డబ్బుకి ఆశపడి అతనితో పాటు లష్కరే తొయిబాలో చేరానని.. శిక్షణ సమయంలో వారు తనకు రూ.20 వేలు ఇచ్చారు. శిక్షణ పూర్తయ్యాక మరో రూ.30 వేలు ఇస్తామన్నారి తెలిపాడు. తర్వాత నన్ను పాకిస్థాన్ సైన్యం వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పినట్టు నేను, మరికొందరు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. దీంతో.. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్న సైన్యం.. ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై కన్నేసి ఉంచుతోంది.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!