Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- ధర్మపురి స్వామివారి కల్యాణం
- భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- సాయినాథుడికి ప్రత్యేక పూజలు
- దీపం గొప్పతనాన్ని వివరించిన హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో ఆరో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. కార్తీక శుద్ధ దశమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నరేంద్ర చౌదరి నేతృత్వంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో 15వ ఏటా సాగుతున్న ఈ ఆధ్యాత్మిక మహా యజ్ఞానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజలు, దీపారాధనకు అవసరమైన సామాగ్రిని నిర్వాహకులే ఉచితంగా పంపిణీ చేయగా, భక్తులు ఉత్సాహంగా దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ప్రత్యేక పూజలు, ప్రవచనాలు
ఆరో రోజు వేడుకల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక ఘట్టాలు కన్నుల పండువగా సాగాయి. శ్రీవాసనందగాపురం శ్రీలలితాపీఠం పీఠాధిపతి శ్రీ స్వస్వరూపానందగిరి స్వామీజీ, అనంతరం రామకృష్ణ మరం స్వామీజీల అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకుంది. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనామృతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. వేదికపై సద్గురు షిరిడీ సాయినాథునికి నిజపాదుక పూజ నిర్వహించగా, భక్తులచే సాయిబాబా విగ్రహాలకు కోటీపుష్పార్చన జరిగింది. అనంతరం కల్పవృక్ష వాహనంపై స్వామివారి సేవ, స్వర్ణలింగోద్భవం, సప్తహారతలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
Also Read
- Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
- Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
- Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
- Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
హరీష్ రావు ప్రసంగం.. దీపం ప్రాముఖ్యత
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఒక దీపం వెలిగిస్తే ఇంటికి వెలుగని, కోటి దీపాలు వెలిగిస్తే జగత్తుకు వెలుగని పేర్కొన్నారు. కోటి దీపాలు వెలిగించడం అంటే దేశంలోని ప్రజలందరి కోరికలు నెరవేరాలని ప్రార్థించడమేనని చెప్పారు. ఒక దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందవచ్చని, హిందూ ధర్మంలో దీపానికి ఉన్న విశిష్టతను ఈ మహా యజ్ఞం చాటి చెబుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాల నుంచి దైవ విగ్రహాలను తీసుకువచ్చి పూజలు నిర్వహించడం, రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం చేస్తున్న ఆధ్యాత్మిక సేవపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమైంది.
కోటిదీపోత్సవం-2026 6వ రోజు ఉత్సవంలో భాగంగా స్వర్ణలింగోద్భవం.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/NLsc2achSj
— BhakthiTV (@BhakthiTVorg) November 19, 2026
కోటిదీపోత్సవం-2026 6వ రోజు ఉత్సవంలో భాగంగా పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/vmKpgYEqjD
— BhakthiTV (@BhakthiTVorg) November 19, 2026
కోటిదీపోత్సవం-2026 6వ రోజు ఉత్సవంలో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2024 #కోటిదీపోత్సవం https://t.co/QUcujEr4qo
— BhakthiTV (@BhakthiTVorg) November 19, 2026
జగతికి వెలుగునిస్తున్న కార్యక్రమం భక్తి టీవీ కోటి దీపోత్సవం : Shri T Harish Rao
#THarishRao #BhakthiTV #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/RZoYSQN1ux
— BhakthiTV (@BhakthiTVorg) November 19, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!