లోక్‌సభ ముందుకు ఓటరు కార్డు-ఆధార్ లింక్ బిల్లు.. విపక్షాల రియాక్షన్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటర్ జాబితా నుంచి బోగస్ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యం అంటూ ఓటరు కార్డు-ఆధార్ కార్డు అనుసంధానికి సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికి ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించగా.. ఇక, ఇవాళ లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు… పౌరుల ఎలక్టోరల్ కార్డులతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని బిల్లు కోరగా, దానిని ప్రవేశపెట్టడాన్ని మాత్రం ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు శాసన సామర్థ్యాలకు మించినదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అంటే, పౌరుల గోప్యతను ఉల్లంఘిస్తున్నారని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.. మరోవైపు.. సోమవారం పార్లమెంట్ ఉభసభలు ప్రారంభం అయిన వెంటనే సస్పెండ్ చేయబడిన ఎంపీలు, ఇతర సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించడంతో.. లాంటి బిజినెస్ లేకుండానే రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడింది.. మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
Read Also: అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..
Also Read
అయితే, లోక్‌సభలో మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని రిజిజు స్పష్టం చేశారు.. కానీ, ఆధార్ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తెలిపారు.. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ బిల్లును తప్పుబట్టారు.. ఆధార్ కార్డును కేవలం అడ్రస్ ప్రూఫ్‌గా వాడారని, కానీ, అది పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదన్నారు శశిథరూర్.. ఓటర్లను ఆధార్ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్ డాక్యుమెంట్ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఆరోపించారు శశిథరూర్.. ఇక, ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.
Read Also: అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!