రసవత్తరంగా కర్ణాటక రాజకీయం.. రాజీనామాకు మంత్రి రెడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. యడియూరప్ప సీఎంగా రాజీనామా చేశాక… ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బసవరాజు బొమ్మైకి… అసంతృప్త నేతలతో తలనొప్పులు మొదలయ్యాయి. కేబినెట్‌లో శాఖల కేటాయింపు విషయంలో… పలువురు మంత్రులు బహరింగంగానే అసహనం వ్యక్తం చేయడం… పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే… కోరుకున్న శాఖ రాలేదని… పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామాకు సిద్ధపడుతున్నారని సమాచారం. నేడో, రేపో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బొమ్మై మాత్రం… కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయని అంటున్నారు. మరో అసంతృప్త మంత్రి ఎంబీటీ నాగరాజ్ అంశం కూడా పరిష్కారం అయ్యిందని చెప్పారు సీఎం బొమ్మై.
కాగా, బసవరాజ్ బొమ్మై ఇటీవల 29 మందితో క్యాబినెట్ విస్తరణ చేశారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప విధేయులైన పలువురు బీజేపీ నేతలకు ఇందులో చోటు దక్కకపోవడంతో బాహాటంగానే కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త మంత్రులు నాగరాజ్, ఆనంద్ సింగ్ తమ శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారితో బొమ్మై చర్చలు జరుపుతూ బుజ్జగింపులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కన్నడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. మరోవైపు.. సీఎం పదవి త్యాగం చేసిన యడియూరప్ప.. తన కుమారుడికి డిప్యూటీ సీఎం పోస్ట్ వస్తుందని ఆశించారు.. కనీసం మంత్రి పదవి అయినా దక్కుతుందని భావించారు.. కానీ, యడియూరప్ప ఆశలకు గండి కొట్టింది బీజేపీ అధిష్టానం.
Also Read
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!