త్వరలోనే బీజేపీ నూతన అధ్యక్షుడిని నియమించనుంది. పరిశీలనలో ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి తదితర నేతల పేర్లు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఓ పదిరోజుల్లో, మొత్తంగా ఈ నెలాఖరులోగా కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తికానుంది.
BJP: బీజేపీని గత కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యాత్నాల్‌ని బీజేపీ బహిష్కరించింది. పార్టీని, పార్టీ సీనియర్ నేత బీఎన్ యడియూరప్పకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగా 6 సంవత్సరాలు బహిష్కరించింది.
Karnataka BJP: కర్ణాటక భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత విభేదాలతో బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ఇది కారణం అయి ఉండొచ్చని సమాచారం.
కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. యడియూరప్ప సీఎంగా రాజీనామా చేశాక… ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బసవరాజు బొమ్మైకి… అసంతృప్త నేతలతో తలనొప్పులు మొదలయ్యాయి. కేబినెట్‌లో శాఖల కేటాయింపు విషయంలో… పలువురు మంత్రులు బహరింగంగానే అసహనం వ్యక్తం చేయడం… పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే… కోరుకున్న శాఖ రాలేదని… పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామాకు సిద్ధపడుతున్నారని సమాచారం. నేడో, రేపో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బొమ్మై మాత్రం……