వరద బీభత్సం.. కపిలతీర్థంలోకి నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కూలిపోయింది పురాతన మంటపం. గడిచిన మూడు రోజులుగా కూలుతూ వస్తున్న మంటపం, గత రాత్రి మరింతగా కూలిపోయింది. దీంతో కపిలతీర్థంలోకి ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు.
కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండలమీద 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. కానీ వర్షాల వల్ల కపిల తీర్థం తీవ్రంగా దెబ్బతింది. కపిల తీర్థంలో కోనేరుకు ఎదురుగా వున్న మండపము వరదల వల్ల కూలిపోయింది. మంటపం పునర్నిర్మించడానికి మరింత సమయం పట్టే అవకాశం వుందని టీటీడీ అధికారులు అంటున్నారు. వరద ప్రవాహం అదుపులోకి ఎప్పుడు వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..