నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకునే అంతగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా మిగలలేదు అనేంతగా అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. కాగా ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ చూస్తే 2024 వరకు బిజీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తిచేయనున్నాడు. కరోనా కారణంగా 2022 లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ సినిమా రానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. 2022 సమ్మర్ లో షూటింగ్ ఉంటే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు 2023లో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఉండనుందని తెలుస్తోంది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అంతా భావించారు. కానీ డేట్స్ కుదరక ఈ ప్రాజెక్ట్ 2023 కి వెళ్ళింది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, దిల్ రాజు సంయుక్తంగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు పరశురామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 2024 లోనే వచ్చేలా కనిపిస్తుంది. కాగా ఈ ఆరుగురి దర్శకులతో టాలీవుడ్ లోనే బిజీ ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ నిలువనున్నాడు!