జానపద కవిసార్వభౌముడు…కొసరాజు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 23న కొసరాజు రాఘవయ్య జయంతి)
తెలుగు చిత్రసీమలో అంతకు ముందు ఎందరు జానపద బాణీ పలికిస్తూ పాటలు అల్లారో కానీ, కొసరాజు రాఘవయ్య చౌదరి కలం ఝళిపించిన తరువాత జానపద బాణీ అంటే ఇదే అన్నారు సాహితీప్రియులు. మన భాషలోని కనుమరుగైన పదాలు, కరిగిపోయిన మాటలు పట్టుకు వచ్చి మరీ జానపదాన్ని జనానికి పరిచయం చేశారు కొసరాజు. అందుకే జనం ఆయనను ‘జానపద కవిసార్వభౌమ’ అని కీర్తించారు. కొందరు ‘కవిరత్న’ అనీ శ్లాఘించారు. కొసరాజు అనగానే జానపద పాటలే రాశారని అనుకుంటారు కానీ, ఆయన కలం నుండి జాలువారిన పాటలెన్నో తెలుగువారిని పరవశింప చేశాయి.
తెలుగునేలపై విశేషంగా వినిపించే బ్రహ్మంగారి తత్త్వాలలోని “నందామయా గురుడ నందామయా…”, ” మకుటం గ్రహించి, పాటను కట్టి ‘పెద్దమనుషులు’లో పరమానందం పంచారు. “జేబులో బొమ్మా జేజేల బొమ్మా…” అంటూ ‘రాజు-పేద’ కోసం కొసరాజు పదాలు చిలికించారు. ఇక కొసరాజు పేరు తలవగానే అందరి తలపుల్లో మొదటగా మెదిలే పాట ఏదంటే ‘రోజులు మారాయి’లోని “ఏరువాకా సాగారో…రన్నో చిన్నన్నా…” పాటనే. ఈ పాట ఈ నాటికీ తెలుగువారిని పులకింప చేస్తూనే ఉండడం విశేషం. “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే…” అని అలుపును మరపించినా, “టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ…” అంటూ వినోదం పంచినా కవిరత్నకే చెల్లింది. “అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటీ… బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా…” అంటూ చిందేయించినా, “నిలువవే వాలు కనులదానా…” అంటూ వయారి హంసనడకల చిన్నదాని వెంట పడి పాటందుకున్నా కొసరాజు కలం బలం ఏ పాటిదో తెలిసిపోతుంది. “అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే…” అంటూ పేకాట పాటలోనూ పలు సెటైర్స్ వేసిన తీరు చూస్తే కొసరాజు బాణీ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక “మామ మామా మామా… ఏమే భామా భామా…” అంటూ ‘మంచిమనసులు’ను విజయతీరం చేర్చడంలోనూ కొసరాజు రచన భలేగా పనిచేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జానపద బాణీల్లో భలేగా పసందు చేసిన పాటలెన్నో ఉన్నాయి.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ఎప్పుడూ జానపద గీతాలే కాదు, “ఏ నిమిషానికి ఏమి జరుగునో…” అంటూ కన్నీరు పెట్టించినా, “కలవారి స్వార్థమూ నిరుపేద దుఃఖము…”అంటూ ఆవేదన కలిగించినా, “జయమ్ము నిశ్చయమ్మురా…భయమ్ము లేదురా…”అంటూ ప్రబోధం పలికించినా వాటిలోనూ కొసరాజు బాణీ కనిపిస్తుంది . ఏది ఏమైనా కడదాకా జనానికి జానపదంలోని రుచిని చూపిస్తూ సాగిన ఘనత కొసరాజు సొంతమయింది. ఆయన నిర్మాతగానూ మారి యన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో కవిరత్నా మూవీస్ పతాకంపై ‘విశ్వరూపం’ తెరకెక్కించారు. 1984లో కొసరాజుకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ఇక జానపదం పేరు వినిపించినంత కాలం కొసరాజు పేరు కూడా మన చెవులకు సోకుతూనే ఉంటుంది. అందుకే ఆయన ‘జానపద కవిసార్వభౌముడు’గా జనం మదిలో నిలిచారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!