(జూన్ 23న కొసరాజు రాఘవయ్య జయంతి)తెలుగు చిత్రసీమలో అంతకు ముందు ఎందరు జానపద బాణీ పలికిస్తూ పాటలు అల్లారో కానీ, కొసరాజు రాఘవయ్య చౌదరి కలం ఝళిపించిన తరువాత జానపద బాణీ అంటే ఇదే అన్నారు సాహితీప్రియులు. మన భాషలోని కనుమరుగైన పదాలు, కరిగిపోయిన మాటలు పట్టుకు వచ్చి మరీ జానపదాన్ని జనానికి పరిచయం చేశారు కొసరాజు. అందుకే జనం ఆయనను ‘జానపద కవిసార్వభౌమ’ అని కీర్తించారు. కొందరు ‘కవిరత్న’ అనీ శ్లాఘించారు. కొసరాజు అనగానే జానపద…