NTV Telugu Site icon

Jagga Reddy: కవిత బెయిల్ పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

Jagga Reddy

Jagga Reddy

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు.. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసిందని తెలిపారు. కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీలో హడావుడి చేశారని.. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆర్ఎస్ చెప్పేసిందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్ కి ఒప్పందాల్లో భాగంగానే బెయిల్ వచ్చిందని జగ్గారెడ్డి ఆరోపించారు. జడ్జి చెప్పకముందే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ లకు ముందు సమాచారం వచ్చిందన్నారు. దేశంలో విచిత్ర పరిపాలన జరుగుతుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోయే దాంట్లో భాగమే లిక్కర్ కేసు అని పేర్కొన్నారు. బీజేపీ వ్యూహం ఏంటంటే… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ను కలుపుకునే పనిలో ఉందని తెలిపారు.

Crime: మైనర్ బాలికలపై అత్యాచారం.. ఒకరిని నమ్మించి, మరొకరిని అపహరించి..

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించిందని విమర్శించారు. కవిత బెయిల్ కండిషన్ లో భాగమే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారన్నారు. మెదక్ లో బీఆర్ఎస్ గెలుస్తది అనే పరిస్థితిలో మూడో స్థానంకి ఎందుకు పోయింది.. కవిత కోసం సొంత పార్లమెంట్ నియోజక వర్గం కేసీఆర్ వదిలేసుకున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోవడమే కారణమని జగ్గారెడ్డి తెలిపారు. రాజకీయంగా కాంగ్రెస్ ను బలహీన పరిచే ఒప్పందంలో భాగమే బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుగడ అని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే ప్రచారం చేసి… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయని తెలిపారు. కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగమేనని పేర్కొన్నారు. సిసోడియా, కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడానికి ఆలోచించిన కోర్టులు.. కవితకు ఐదు నెలల్లో బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

Minister Damodar Rajanarsimha: రాష్ట్రంలో డెంగ్యూ విజృంభణ.. అధికారులకు దిశానిర్దేశం

బీజేపీ గెలిచిన పార్లమెంటు నియోజక వర్గాల్లో.. రేపు ఎన్నికలు అనగా బీఆర్ఎస్ ఏజెంట్లు, ఎమ్మెల్యేలు కూడా లేరన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కూడా.. కాంగ్రెస్ కి వేయకండి, బీజేపీకి వేయండి అని ప్రచారం చేశారన్నారు. బీజేపీ ఉత్తరాదిన వీక్ అయ్యింది.. దక్షిణాదిలో బీఆర్ఎస్ ను బలహీన పరిచారని తెలిపారు. ఏపీలో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని సీట్లు గెలిచిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓ పావుగా బీజేపీకి పని చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కి మంచి రోజులు బీజేపీ వల్ల వచ్చిందని.. తాము జడ్జిని తప్పు పట్టడం లేదు.. జడ్జి చెప్పక ముందే బీఆర్ఎస్ చెప్పడమేంటనేది తమ వాదన అన్నారు. మూడు రోజుల ముందే బెయిల్ వస్తుందని హడావుడి చేసిన కేసీఆర్ కుటుంబం పై న్యాయవ్యవస్థ చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.