జడ్జి హత్య కేసు… సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ జడ్జి హత్య కేసులో సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. అయితే, అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరచడం బాధాకరమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ఇక, జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును నిన్న స్వాధీనం చేసుకుంది సీబీఐ.. జూలై 28న మార్నింగ్ వాక్‌కు వెళ్లిన న్యాయమూర్తి ఆనంద్‌ను ఆటోతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల కేంద్రానికి సిఫారసు చేశారు. దీంతో.. సీబీఐ రంగంలోకి దిగింది.
మరోవైపు కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్ సుమోటోగా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును విచారణకు స్వీకరించింది.. ఈ సందర్భంగా జార్ఖండ్ ప్రభుత్వ తరపున న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు.. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో సీబీఐకి ఈ కేసును ట్రాన్స్‌ఫర్ చేసిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు… ఈ కేసు సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జడ్జిలకు వస్తున్న బెదిరింపులపై ఐబీకి గానీ, సీబీఐకి గానీ ఫిర్యాదు చేసినా.. అటువైపు నుంచి సానుకూలమైన స్పందన రావడంలేదన్నారు. ఇక, ఈ కేసులో వచ్చేవారం నుంచి పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్టు తెలిపారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!