ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరను తగ్గిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ధర బుధవారం( మార్చి 22) నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు మునుపటిలా పరుపులను అందుబాటులో ఉంచనున్నారు.
Also Read: Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్‌కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్లో, కౌంటర్లో టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ముందుగా బుక్ చేసిన టిక్కెట్లకు అదనపు మొత్తాన్ని వాపసు ఇవ్వబడుతుంది. గత సంవత్సరం జారీ చేసిన సర్క్యులర్ ద్వారా AC-3 టైర్ టికెట్ ధరతో సమానంగా 3-టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరను తగ్గించారు.
Also Read: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు
అత్యుత్తమ, చౌకైన AC ప్రయాణ సేవలను అందించడానికి రైల్వే త్రీ-టైర్ ఎకానమీ కోచ్‌లను ప్రవేశపెట్టారు. ఈ కోచ్‌ల ధర సాధారణ ఏసీ 3 టైర్ కంటే 6-7 శాతం తక్కువ. ఏసీ 3 టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉండగా, ఏసీ 3 టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉన్నాయి. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే రైల్వే రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022లో ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు. దీని ద్వారా రూ.177 కోట్ల ఆదాయం వచ్చింది.