Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’
- ట్రంప్ ఉగ్రవాద వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన పెజెష్కియన్
- యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను ఉగ్రవాదులు అని పిలిచారు.. కానీ మేము ఉగ్రవాద బాధితులం అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పెజెష్కియన్.. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో మరణించిన విద్యార్థుల ఫొటోలను చూపించి ప్రసంగించారు.

Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ఇరాన్‌ను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడం తప్పు అని ట్రంప్ చేసిన ప్రకటనను తిప్పికొట్టారు. అణుశక్తి ఇరాన్ హక్కు అని కూడా స్పష్టం చేశారు. ఇరాన్‌లోని పౌరులను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పెజెష్కియన్ తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే అమెరికా ప్రతినిధి బృందం సభా మందిరం నుంచి నిష్క్రమించింది.
ఇక ప్రసంగంలో అమెరికా-ఇజ్రాయెల్‌లపై తీవ్ర స్థాయిలో మసూద్ పెజెష్కియన్ విమర్శలు గుప్పించారు. ఇరాన్‌కు, ఉగ్రవాదానికి సంబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఇరాన్ స్వయంగా ఉగ్రవాదానికి బాధితురాలిగా మారిందని అన్నారు. ఒక రోజు ముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ను ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్‌గా అభివర్ణిస్తూ.. దానిపై ఆర్థిక బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అణుశక్తి ఇరాన్ హక్కు అని, ఇరాన్ ఆత్మరక్షణ కోసం పోరాడుతోందని పెజెష్కియన్ పేర్కొన్నారు.
‘‘నిన్న ట్రంప్ మమ్మల్ని ఉగ్రవాదులని పిలిచారు. కానీ మేము ఉగ్రవాద బాధితులం. దాడులలో అమాయక ఇరాన్ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మాపై దాడి చేశాయి. వారు మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. కానీ మేము లొంగిపోలేదు. మేము మా సర్వశక్తులతో మమ్మల్ని మేము రక్షించుకున్నాము. ఇరాన్ తనను తాను రక్షించుకుంటోంది.’’ అని అన్నారు. ఇజ్రాయెల్‌పై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ వివిధ నగరాలు, ప్రావిన్సులలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తోందని పేర్కొన్నారు. గాజాను ప్రస్తావిస్తూ అక్కడ 80,000 మందికి పైగా అమాయక పౌరులు చంపబడ్డారని పెజెష్కియన్ ఆరోపించారు.
ఇరాన్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిని కూడా పెజెష్కియన్ ప్రస్తావించారు. పిల్లల ఫొటోలను చూపిస్తూ.. ఆ పిల్లలు అమాయకులని, ఎలాంటి నేరం చేయలేదని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఆయుధాలతో జరిగిన దాడుల్లో ఈ పిల్లలు చంపబడ్డారని ఆరోపించారు. ఒప్పందం కుదరకపోతే తీవ్రమైన సైనిక చర్య తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన తర్వాత పెజెష్కియన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!