దుబాయ్ వేదికగా కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం టీమిండియాను భయపెడుతున్నాడు. కొన్నేళ్లుగా టీమిండియా ఆడుతున్న నాకౌట్ మ్యాచ్‌లలో అతడు నిలబడితే చాలు.. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తథ్యం అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ అతడు ఎవరంటే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో.
Also Read: భారత్-కివీస్ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సిక్సులు కొట్టిందెవరు?
2014 నుంచి 2017 వరకు జరిగిన ఐసీసీ మేజర్ టోర్నీల్లో భారత్ ఆడిన నాకౌట్ మ్యాచ్‌లకు, 2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు రిచర్డ్ కెటెల్‌బర్గ్ ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు. అయితే ఆ మ్యాచ్‌లన్నింటిలో భారత్ ఓడిపోయింది. ఈరోజు న్యూజిలాండ్‌తో భారత్ ఆడే నాకౌట్ లాంటి మ్యాచ్‌కు కూడా రిచర్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతూ మీమ్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కూడా ఇలాంటి ఓ మీమ్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు.
Happy Halloween Indian fans 🎃 #INDvNZ #T20WorldCup pic.twitter.com/22v9EV0Mdc
— Wasim Jaffer (@WasimJaffer14) October 31, 2021