ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. అయినప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఒమిక్రాన్ కేసులు క్రమంగా చాపకింద నీరులా పెరుగుతున్నాయి. 1.44 బిలియన్ జనాభా కలిగిన భారత దేశంలో సెకండ్ వేవ్ సమయంలో కేసులు ఏ స్థాయిలో విజృంభణ జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు.
Read: గోదావరిపై తెలంగాణ అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోంది : ఏపీ
అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ ఆదే విధంగా విస్తరిస్తే పరిస్థితి ఏంటి? ఆ స్థాయిలో కేసులు నమోదవుతాయా లేదా అనే అంశంపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పాల్ కుట్టిమన్ సర్వేను నిర్వహించారు. ట్రాకర్ సర్వే ప్రకారం అతి త్వరలోనే ఇండియాలో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దీనికి ఉదాహరణ రోజువారి పెరుగుతున్న కేసులే అని తెలిపారు. రాబోయే వారం రోజుల వ్యవధిలో కేసులు భారీగా నమోదవుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తే థర్డ్‌వేవ్ ముప్పునుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్ పాల్ తెలిపారు.