Playgrounds under flyovers: హైదరాబాద్‌లో త్వరలో ఫ్లైఓవర్ల కింద క్రీడా మైదానాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాధించింది. ఓవైపు అభివృద్ధి మరోవైపు పరిశ్రమల ఏర్పాటుతో హైదరాబాద్ పేరు మార్మోగుతోంది. నగరంలో సుందరీకరణ కోసం అనేక చర్యలు తీసుకుటోంది ప్రభుత్వం. తాజాగా హైదరాబాద్ త్వరలో ఫ్లైఓవర్ల కింద ప్లేగ్రౌండ్ల కొత్త కాన్సెప్ట్‌ను చూడబోతోంది. ముంబయిలోని ఫ్లై ఓవర్ కింద క్రికెట్, ఇతర క్రీడలు ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ కాన్సెప్ట్ హైదరాబాద్ లోనూ అమలు చేయాలని ఓ వ్యక్తి ట్వీట్టర్ లో కోరాడు. ఈ ప్రతిపాదనకు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.
Also Read: Charges on UPI payments: రూ.2 వేలు దాటితే యూపీఐ పేమెంట్స్‌పై అదనపు బాదుడు..! నిజమేంటి..?
కాన్సెప్ట్ ఆకట్టుకున్న తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కేటీఆర్ నగరంలోని ఫ్లైఓవర్ల కింద ప్లేగ్రౌండ్లు నిర్మించాలనే ఆలోచనను ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ల కింద ప్లేగ్రౌండ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ, కేటీఆర్ తన ప్రతిపాదనను ట్వీట్ చేశారు. నగరంలోని కొన్ని ప్రదేశల్లో ఈ కాన్సెప్ట్ అమలు చేయాలని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. మంచి ఆలోచన అని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు.
Also Read
- Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
- Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
- Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
- Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
Let’s get this done in a few places in Hyderabad @arvindkumar_ias
Looks like a nice idea https://t.co/o0CVTaYxqb
— KTR (@KTRBRS) March 27, 2023
ఫ్లై ఓవర్ల కింద ఉన్న స్థలాన్ని వినియోగించుకోవాలనే ఆలోచన వినూత్నమే కాకుండా ఆచరణాత్మకమైనది కూడా. ఇది నిర్లక్ష్యానికి గురైన స్థలాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వినోద కార్యకలాపాలకు శక్తివంతమైన ప్రదేశంగా మారుస్తుంది. ఇది కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ, ఇది ఇప్పటికే ప్రపంచంలోని వివిధ నగరాల్లో అమలు చేయబడినందున హైదరాబాద్ వాసులకు ఇది కొత్తది.
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల కింద ప్లేగ్రౌండ్ల ప్రతిపాదన రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. క్రీడలు, ఫిట్నెస్ కార్యకలాపాలను ప్రోత్సహించడమే కాకుండా, ప్లేగ్రౌండ్ ప్రజలకు సామాజిక కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ చొరవ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ప్రజలు తమ విశ్రాంతి సమయాన్ని నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించుకుంటారు. హైదరాబాద్‌లో చాలా ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో అనేక ఫ్లైఓవర్లు ప్రారంభమయ్యాయి. వాటి క్రింద ఉన్న స్థలాన్ని ఉపయోగించడం లేదా పచ్చదనంగా మార్చడం జరుగుతుంది. కొత్తగూడ, శిల్పా లేఅవుట్, నాగోల్, చాంద్రాయణగుట్ట, కైతలాపూర్, బహదూర్‌పురా, LB నగర్ ఫ్లైఓవర్ల కింద ప్లేగ్రౌండ్ల కొత్త కాన్సెప్ట్ అమలుకు అనువుగా ఉంటుందనే అభిప్రాయపాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: MLA Arthur: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకూ ఆఫర్ వచ్చింది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
-
Sabarimala : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
-
Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!