భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొంత మంది వివాహేతర సంబంధాల కోసం హత్యలకు తెగబడుతుంటే.. ఇంకొందరు కుటుంబ కలహాలతో జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్నారు. ఇలా ఎక్కడో చోట నేరాలు-ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. క్షణికావేశంలో కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లాలోని నకిరికల్లు శివారు ప్రాంతం దుప్పలకొండ ఏరియాలో రైల్వే ట్రాక్ దగ్గర మహిళ మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతురాలు తోరటి మేరీ(29)గా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంతోనే భార్యను చంపి రైల్వేట్రాక్ దగ్గర పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీని పరిశీలించగా బైక్‌పై మేరీని తీసుకెళ్తున్నట్లుగా కనిపించింది. భర్త రమేష్‌ను నర్సరావుపేట వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు.. ఆంతర్యమిదేనా?
ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
