హెచ్‌ఐవీ టెస్ట్‌లు భారీగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసుల్లో రాష్ట్ర రాజధాని అగ్రస్థానంలో ఉంది.. ఎక్కువ మంది విద్యార్థులే బాధితులుగా ఉండడంతో… సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్.. కొంత కాలంగా అగర్తాలో భారీగా ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని, అందులో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని పేర్కొన్న ఆయన.. ఈ నేపథ్యంలో అవసరమైతే రాజధానిలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్‌ఐవీ టెస్ట్‌లు నిర్వహించాలని తెలిపారు..
Read Also: అగ్రరాజ్యాన్ని తాకిన ‘ఒమిక్రాన్’.. ఆంక్షలు విధింపు..!
ఇక, డ్రగ్స్ మూలాలను కూడా కనుక్కోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణం డ్రగ్స్‌గా భావిస్తోంది ప్రభుత్వం.. మాదకద్రవ్యాల వినియోగంతోనే ప్రతికూల మనస్తత్వం ఏర్పడుతుందని… దీంతో విద్యార్థులు పెడదారులు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, అగర్తలాలో ప్రతిరోజూ మూడు హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయట.. అందులోనూ కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని.. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని.. పరిస్థితిని అదుపుచేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.