NTV Telugu Site icon

కొండపల్లి మున్సిపాలిటీ వద్ద మళ్ళీ హైటెన్షన్

కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను జరిపి తీరాల్సిందేనని పట్టుపడుతోంది టీడీపీ. ఏదో విధంగా ప్రక్రియను ఆపేందుకు వైసీపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కొండపల్లి పంచాయతీ రసకందాయంగా మారింది. కొండపల్లి మునిసిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా జరిగిన పరిణామాలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. గొడవ సృష్టిస్తోన్న వైసీపీపై చర్యలు తీసుకుని, సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టులో ఈ పిటిషన్ కు విచారణకు వచ్చే అవకాశం వుంది.

READ ALSO :కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తొలి రోజు కౌన్సిల్ హాల్లో జరిగిన పరిణామాలతో ఎన్నిక జరపలేకపోయామంటున్నారు అధికారులు. ఇవాళ కూడా ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ జరపలేకుంటే.. అదే విషయాన్ని ఎస్ఈసీకి వివరించనున్నారు అధికారులు. ఇవాళ కూడా ఎన్నిక చేపట్టకుంటే కోర్టు ధిక్కారణే అంటోంది టీడీపీ. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ-టీడీపీ కార్యకర్తల నినాదాలు చేస్తున్నారు. నిన్నటి ఘటనలతో భారీగా పోలీసులు మోహరించారు.