బిగ్‌బాస్-5: అప్పుడు హోస్ట్… ఇప్పుడు గెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన షూటింగ్ శనివారమే జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మూవీ ’83’ యూనిట్‌తో పాటు ఆర్.ఆర్.ఆర్ యూనిట్, శ్యామ్‌సింగరాయ్ యూనిట్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఏ సినిమాకైనా ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాలంటే బిగ్‌బాస్ సరైన వేదిక కాబట్టి ఆయా మూవీ యూనిట్స్ బిగ్‌బాస్ ఫినాలేను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్యామ్‌సింగరాయ్ మూవీ నుంచి హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి బిగ్‌బాస్ స్టేజీమీదకు వచ్చినట్లు సమాచారం.
గతంలో బిగ్‌బాస్ సీజన్-2కు హోస్టుగా వ్యవహరించిన హీరో నాని.. ఇప్పుడు గెస్టుగా హాజరుకావడం గమనార్హం. ఈ సందర్భంగా హీరో నాని ఫీలింగ్ తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సీజన్-2 సమయంలో అప్పటి కంటెస్టెంట్ కౌశల్ అభిమానులు హీరో నానిని దారుణంగా ట్రోల్ చేయడంతో తరువాతి సీజన్‌లకు నాని దూరంగా ఉన్నాడు. ఇప్పుడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా అతడు మళ్లీ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చాడు. కాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
ఇక బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాప్-5 కంటెస్టెంట్లలో తొలుత సిరి, ఆ తర్వాత మానస్ ఎలిమినేట్ కాగా… మూడో వ్యక్తిగా షణ్ముఖ్ బయటకు వచ్చినట్లు సమాచారం. రన్నరప్‌గా నిలుస్తాడని భావించిన షణ్ముఖ్ నిరాశపరిచాడని.. అతడి స్థానంలో శ్రీరామ్ రన్నరప్‌గా నిలిచాడని తెలుస్తోంది. అటు విన్నర్‌గా నిలిచిన వీజే సన్నీ రూ.50 లక్షలతో పాటు బైక్, సువర్ణభూమి ఇంటి స్థలం దక్కించుకున్నాడని టాక్.
ఈ కింది వార్త కూడా చదవండి:
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!